భారత్ లో 10వేల మంది పాక్ జాతీయులు..!

భారత దేశంలో పలు వీసాలపై పదివేల మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకూ దేశంలో ఉన్న పాకిస్థానీయులు భారత్ ను వీడాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసింది.
ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల డీజీపీలు సైతం వీసాలపై ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తక్షణమే దేశం విడిచిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ వాఘా సరిహద్దు నుండి 272మంది పాక్ కు తరలివెళ్లారు.
ఇప్పటికే వందల మంది సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు పాక్ నుండి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరితో పాటు పదమూడు మంది దౌత్యవేత్తలు చేరుకున్నారు.