మోదీ సర్కారు కీలక నిర్ణయాలు

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో శుక్రవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకుగానూ రూ.12,060 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశంలోని అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర క్యాబినెట్ పేర్కొంది. రూ.7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని ఈ సందర్భంగా మోదీ సర్కారు ప్రకటించింది. సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లు ప్రకటించినట్లు వెల్లడించింది . దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్‌కు నిర్ణయం తీసుకున్నది.
దేశీయ ఎల్పీజీలో నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు రూ.30,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర సర్కారు వివరించింది. మరక్కనం – పుదుచ్చేరి 4-లైన్ హైవే కోసం రూ. 2,157 కోట్లు కేటాయింపు జరిగినట్లు మోదీ సర్కార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది