ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం

పల్లవి, వెబ్ డెస్క్ : త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తమ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యావిధానాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించేశారు.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా స్టాలిన్ ప్రభుత్వం ద్విభాషా విధానం వైపు మొగ్గుచూపింది. దీనికి సంబంధించిన తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (ఎస్ఈపీ)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈరోజు శుక్రవారం ఆవిష్కరించారు.
తాజాగా స్టాలిన్ సర్కారు తీసుకోచ్చిన విధానం జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఏఐ, సైన్స్, ఇంగ్లీష్ లకు పెద్దపీట వేశారు. ఇక పదకొండు, పన్నెండు తరగతుల మార్కుల ఆధారంగా యూజీ ఆడ్మిషన్లు ఉంటాయని తమిళ నాడు రాష్ట్ర విద్యా శాఖ తెలిపింది. ఈ సరికొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి 2022లో రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ప్యానెల్ గత ఏడాది జూలైలో ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆ నివేదికను సమర్పించింది. ఆ నివేదికను తాజాగా ముఖ్యమంత్రి విడుదల చేశారు. 3, 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలకు నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీని కారణంగా అధిక డ్రాపౌట్ రేట్లు పెరుగుతాయని ఆ ఫ్యానెల్ అభిప్రాయపడింది.