ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం

పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం గురించి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పందిస్తూ ” మీరు చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించండి లేదా దేశానికి క్షమాపణలు చెప్పండి. మూడో ఆప్షన్ లేదు. ఏడు రోజుల్లో అఫిడవిట్ రాకుంటే ఆరోపణలన్నీ నిరాధారమైనవని భావిస్తాం ” అని తెలిపిన సంగతి తెలిసిందే.
దీంతో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ అయిన జ్ఞానేశ్ కుమార్ పై ఇండి కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. ఒకవేళ తీర్మానం పాసైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీఈసీని తొలగిస్తారు. అయితే ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి పూర్తి మెజార్టీ ఉంది. దీంతో ఇండి కూటమి ప్రవేశపెట్టే తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు.