ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖ గుప్తాకి షాక్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖ గుప్తా సివిల్ లైన్స్‌లోని ‘జన్ సున్‌వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సఖ్రియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీ ఆటోడ్రైవర్ అని, అతడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు.
ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సీఎం నివాసంలో భద్రతా లోపాలను కూడా గుర్తించారు. ఈ లోపాల కారణంగా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈక్రమంలో తాజాగా సీఎం రేఖ గుప్తా కు కల్పించిన జెడ్ కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇకపై ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత కల్పించనున్నారు. సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన నేపథ్యంలో కేంద్రం సీఎంకు జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రికీ భద్రత కల్పించాలని కేంద్ర హోమ్ శాఖ సీఆర్‌పీఎఫ్‌ను ఆదేశించింది.