వీవింగ్ బాండ్స్ ఆఫ్ కంపాషన్: ఎ యూనిఫైడ్ కమ్యూనిటీ ఎట్ డిపిఎస్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్..
 
                                
నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్‌లో విద్యార్థులకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించడం మా ప్రాథమిక లక్ష్యం. ప్రతి విద్యార్థిలో సమగ్రత, నిజాయతీ, నమ్మకం, సహనం, కరుణ వంటి ముఖ్యమైన లక్షణాలను పెంపొందించడానికి మేము అంకితభావంతో ఉన్నాం. జూన్ నెలలో, మేము మా డీపీఎస్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కంపాషన్ విలువను పెంపొందించడంపై దృష్టి సారించాం. మొట్టమొదటిసారిగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్‌లో ఉపాధ్యాయులు, అన్ని స్థాయిల విద్యార్థులు మేము నిర్వహించిన వర్క్‌షాప్‌లో భాగమయ్యారు. ఈ వర్క్‌షాప్‌లో ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు, అడ్మిన్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ హెడ్లు, మేనేజ్మెంట్, సహాయక సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
మేము ఏమి చేశాం?
కంపాషన్ వెబ్ యాక్టివిటీ మా పాఠశాల సంఘంలోని సభ్యులందరినీ ఒక అర్థవంతమైన, ఇంటరాక్టివ్ మార్గంలో ఒకచోట చేర్చడానికి రూపొందించబడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకత్వ, సహాయక సిబ్బందితో సహా పాల్గొనేవారు కంపాషన్ పై తమ అవగాహనను పంచుకోవడానికి సమావేశమయ్యారు. ప్రతి వ్యక్తి మరొకరి పట్ల కనికరం చూపడం గురించి వారి ఆలోచనలను పంచుకున్నాక, థ్రెడ్ చివరను పట్టుకుని, థ్రెడ్ బంతిని మరొకరికి పంపారు. భాగస్వామ్య కరుణ ద్వారా మా కమ్యూనిటీ పరస్పర అనుసంధానాన్ని దృశ్యమానంగా సూచించే వెబ్ ఏర్పడే వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.
కార్యాచరణ వెనుక ఆలోచన :
ఏది ఏమైనప్పటికీ, కంపాసన్ అనేది ఎంపథీతో మొదలవుతుంది. సానుభూతి అందించడంకంటే ఇతరుల బాధను తగ్గించడానికి తీసుకునే చర్యలు ముఖ్యమైనవి. కనికరం అంటే నిస్వార్థంగా సహాయం అందించడం, తీర్పు లేకుండా వినడం, ఇతరులకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండటం వంటివి తెలపడమే మా లక్ష్యం. దీనికి ప్రతీకగా, మనల్ని ఏకం చేసే కంపాషన్ నెట్‌వర్క్‌ను సూచించే భౌతిక వెబ్‌ను మేము సృష్టించాం. వెబ్‌లోని ప్రతి థ్రెడ్ కంపాషన్ పట్ల వ్యక్తిగత నిబద్ధతను సూచిస్తుంది,
ప్రభావం :
కంపాషన్ వెబ్ యాక్టివిటీ ప్రభావం చాలా లోతైనది, చాలా విస్తృతమైనది.
విద్యార్థులు: కంపాషన్ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటారు. తోటివారి పట్ల ఎలా మెరుగ్గా ఉండగలరో పంచుకోవడమే కాకుండా, సహాయక సిబ్బందికి సహాయక వాతావరణాన్ని కల్పించడంలో ఎలాంటి పాత్ర అవసరమో అర్థం చేసుకున్నారు.
తల్లిదండ్రులు: పాఠశాల సంఘంతో మరింత కనెక్ట్ అయ్యారని, ఇంట్లో సానుభూతి, దయను పెంపొందించడానికి వారి నిబద్ధతను బలపరిచారు. ఇది అద్భుతమైన వర్క్‌షాప్ అని, ఇంతకు ముందెన్నడూ చేయని పని అని తల్లిదండ్రులు అన్నారు.
ఉపాధ్యాయులు : కార్యాచరణను శక్తివంతమైన బోధనా సాధనంగా భావించారు. ఇది ఎంపథీ, కంపాషన్ ఆచరణాత్మక ప్రదర్శనను అందించింది. దానిని వారు భవిష్యత్ పాఠాలలో తిరిగి ప్రస్తావించే అవకాశం ఉంది. శక్తివంతమైన సాధనంగా మాత్రమే కాకుండా, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలా భావిస్తున్నారో తెలసుకునే అవకాశం ఉంది.
సహాయక సిబ్బంది : తమ ఆలోచనలను పంచుకునే, ఇతరుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని పొందినట్లు భావించారు. ఇది పాఠశాల సంఘంతో వారి బంధాన్ని బలోపేతం చేసింది. నిర్వాహకులు వారు సుఖంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. వారి సౌకర్యవంతమైన భాషలో స్పష్టమైన సూచనలు అందుకున్నారు.
మొత్తమ్మీద కంపాషన్ వర్క్‌షాప్, ది కంపాషన్ వెబ్ యాక్టివిటీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మన దైనందిన జీవితంలో కంపాషన్ ప్రాముఖ్యతను పటిష్టం చేసింది. డీపీఎస్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో బంధాలను బలోపేతం చేసింది. మా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సంఘం, సహాయక సిబ్బంది అందర్నీ ఒకచోటకు చేర్చించి ఈ వర్క్ షాప్.
– ఆరోగ్యం, సంరక్షణ విభాగం,
డీపీఎస్ నాచారం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్.



 
          



