టీచర్ల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం

అకాడమిక్ నాలెడ్జ్‌తో పాటు విద్యార్థులకు అత్యంత విలువైన అంశాలపై అవగాహన ఉండాలి. అందులో సాంకేతిక పురోగతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు, అసమానతలు, పర్యావరణ పరిరక్షణ అంశాలను కచ్చితంగా విద్యార్థులు తెలుసుకోవాలి. అయితే సోషల్ మీడియా ఇప్పటి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కానీ అందులో నిజాలేవో, అబద్ధాలేవో గ్రహించడం అవసరం. వీటన్నింటిపై విద్యార్థుల్లో స్పష్టత రావాలంటే సరైన ప్లాట్‌ఫామ్ ఉండాలి. ఆ ఫ్లాట్‌ఫామ్ కచ్చితంగా టీచర్లై ఉండాలి. దానికోసం పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అదే టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. నర్చరింగ్ క్యారెక్టర్ ఫర్ ఇగ్నైటెడ్ ఫ్యూచర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ కోసం వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల శ్రేయస్సును మెరుగుపరచడానికి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఉంటుంది. ముఖ్యంగా వీఐహెచ్ఈ డైరెక్టర్, చెన్నై శ్రీరామక్రిష్ట మఠం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ధర్మం, దానం, సహనం వంటి విలువలను టీచర్లు తమ బోధనా విధానంలో ఆచరించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఇలాంటి విలువలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇలా సాధికారత పొందిన ఉపాధ్యాయుల ద్వారా పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ఈ విలువలు సహజంగా వస్తాయి.
Related News
-
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి
-
తీన్మార్ మల్లన్న సరికొత్త పార్టీ ..
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు