ఏరోసిటీ డీపీఎస్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్-2025 వేడుకలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏరోసిటీ -ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో సమ్మర్ క్యాంప్ -2025 గ్రాండ్ ఫినాలే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక మరియు సాంకేతిక ,విద్య సంబంధిత. సాంప్రదాయకరమైన పలు సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సమ్మర్ క్యాంప్ వేడుకల్లో యోగా, నృత్యం, గ్రూప్ సింగింగ్, నేపథ్య గానం మరియు కవితా పఠనం లాంటి పలు కాంపిటేషన్స్ కార్యక్రమాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. అంతేకాకుండా చేనేత కళలు, డ్రాయింగ్ ,భేల్పూరి, శాండ్ విచ్ మరియు నిమ్మరసం తయారీ కేంద్రాలను , ఫైర్ లెస్ వంట స్టాళ్లను ఏర్పాటు చేయడం అందర్ని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్ వైద్య అధికారి డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు. ఆయన అభిరుచులను మరియు సృజనాత్మకతను పెంపొందించుకునేలా ప్రేరేపించే స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. అనంతరం విద్యార్థులందర్నీ అవార్డులతో సత్కరించారు.
Related News
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్