డీపీఎస్ (నాదర్ గుల్) లో ఘనంగా ఇన్వెస్టరీ వేడుక

పల్లవి, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలోని నాదర్ గుల్ గ్రామంలో స్థాపించబడిన ప్రముఖ విద్యాసంస్థల్లోఒకటైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థి నాయకుల పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమాలు ప్రధానాచార్యురాలైన శ్రీమతి. అనుపమసక్సేనా గారి ఆధ్వర్యంలో ఉప ప్రధానాచార్యులు సుమన్ రాథోడ్ గారి సారథ్యంలో కన్నుల పండుగగా జరిగాయి. ఈకార్యక్రమానికి ఇండియన్ ఆర్మీ కమాండర్ ఆష్ తోష్ గుప్తా గారు, IRS శ్రీ అజాజుద్దీన్ (హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్) గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో N.C.Cవిద్యార్థినుల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థులు తమ ఆటపాటలతో, మార్చిఫాస్ట్, కరాటే విన్యాసాలు, కూజిత బృందం ఆలపించిన మధుర గానాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. క్రమశిక్షణకు మారుపేరైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్ గుల్ లో ఎన్నికలు నిర్వహించి విద్యార్థులు తమ నాయకులను తామే ఎన్నుకునే అవకాశాన్ని కల్పించి ,ఫలితాలలో గెలిచిన విద్యార్థినీ – విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు నాయకత్వ లక్షణాలు ఉట్టి పడే విధంగా పదవీ ప్రమాణాలు చేసి అందరి మన్ననలను అందుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థునీ – విద్యార్థుల ప్రతిభాపాటవాలను వీక్షించినటువంటి తల్లిదండ్రులు, ఇతర అతిధులు ఎంతగానో విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి కొనియాడారు.
ఈసభలో ముఖ్యఅతిథిగారు ప్రసంగిస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని, ఇటువంటి క్రమశిక్షణ జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తుందని, నాయకత్వ లక్షణాలు ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని భవిష్యత్తులో దేశాభివృద్ధి కోసం పాటుపడాలని, తల్లిదండ్రులు, గురువుల మాటలను గౌరవించి వారి బాటలో నడవాలని విద్యార్థినీ – విద్యార్థులకు సందేశాన్ని అందించారు. ఈ సభలో ఉప ప్రధానాచార్యురాలైన శ్రీమతి. సుమన్ రాథోడ్ మేడం గారు సభాముఖంగా పాఠశాల యొక్క నివేదిక విన్నవించి, విద్యార్థులు సాధించిన ఘనతను గూర్చి సభాముఖంగా తెలిపారు.
పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీ. మల్కా కొమరయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులు భావి భారత పౌరులని భవిష్యత్తులో బాగా చదివి పాఠశాలకే కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఇలా విద్యార్థుల ప్రతిభను చాటుకోవడానికి మరిన్ని అవకాశాలు కూడా కల్పిస్తామని సభాముఖంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఉపప్రధానాచార్యురాలు శ్రీమతి.లక్ష్మీశిరీషగారు, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి.ఇంద్రిత గారు మరియు శ్రీమతి. సీతగారు మొదలైనటువంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ – ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు, అతిథులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 24-25 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు