కష్టపడితే ఏదైనా సాధ్యమే : మల్క కొమరయ్య

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్లకు మేనేజ్మెంట్ ఆన్యువల్ డిన్నర్ ఏర్పాటు చేసింది. డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ టీచర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్సెస్ గురించి టీచర్లకు చైర్మన్ మల్క కొమరయ్య కీలక సూచనలు చేశారు. తాను మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి..ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపారు. కష్టపడితేనే సక్సెస్ లభిస్తుందని.. కష్టపడకుండా ఏదీరాదని చెప్పారు. అటు విద్యార్థులకు సైతం ఈజీగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని సూచించారు. విద్యార్థులు సైతం క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదవుతో పాటు ఆటల్లోనూ రాణించాలని చెప్పారు.