ఒక పుస్తకం.. మంచి మిత్రుడితో సమానం

హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో శనివారం నేషనల్ వరల్డ్ బుక్ డేను నిర్వహించారు. 5, 6వ తరగతుల స్టూడెంట్లు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. మన జీవితాల్లో పుస్తకం ప్రాముఖ్యత, ప్రాధాన్యతను వివరించారు. పుస్తకాలు మన జ్ఞానాన్ని ఎలా మెరుగుపరుస్తాయనే దానిపై స్టూడెంట్లు అవగాహన ప్రదర్శనలు ఇచ్చారు. ‘ ఒక్కో పుస్తకం.. ఒక్కో విధంగా మనల్ని ప్రేరేపిస్తాయి, స్ఫూర్తినిస్తాయన్నారు. పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహిద్దాం.. పుస్తకాల ప్రపంచాన్ని అన్వేషిద్దాం’ అంటూ స్టూడెంట్లు పిలుపునిచ్చారు. పుస్తకం చదువుతుంటే మనలో కొత్త ప్రపంచాన్ని, ఆలోచనలను, దృక్పథాల తలుపు తెరుస్తుందని… మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మన పరిధులను విస్తృతం చేస్తుందని చెప్పారు. ‘ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానం’ అంటూ స్టూడెంట్లు ఈ కార్యక్రమాన్ని ముగించారు.
Related News
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
స్థానిక ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేద్దాం- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య