స్థానిక ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేద్దాం- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : రాబోయే స్థానిక, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడి పని చేసి బీజేపీ పార్టీని గెలిపించుకుందాం అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాం చంద్రరావు లతో కల్సి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ” వచ్చే స్థానిక , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా కాషాయపు జెండాను ఎగురవేయాలి అని క్యాడర్ కు పిలుపునిచ్చారు.
స్థానిక , పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త, నేతలు కృషి చేయాలి.టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరంతా కల్సి పని చేసి నన్ను గెలిపించారు.అదేవిధంగా కష్టపడి పని చేస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలి అని అన్నారు. కాళేశ్వరం అవినీతి కేసులో కేసీఆర్ కుటుంబ ఇరుక్కుంది. ప్రాజెక్టు ఒకచోట కట్టకుండా వేరే చోట కట్టి లక్ష కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నారు.
గత ఎన్నికల్లో అలవీకానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను మించి అవినీతి చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాలను మోసం చేసింది అని ఆరోపించారు.మోదీ గారు దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నారో రేపు తెలంగాణను అభివృద్ధి చేయగల పార్టీ బీజేపీ.బండి సంజయ్ గారు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు.రాంచంద్రరావు గారు ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానం మొదలై ఎమ్మెల్సీ అయి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అయ్యారు.అదే విధంగా బీజేపీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని పేర్కొన్నారు.కరీంనగర్ గడ్డకు ఓ చరిత్ర ఉంది. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త చరిత్రకు నాంది పలుకుదాం. ప్రతి అభ్యర్థి గెలుపు కోసం నావంతు కృషి చేస్తాను అని అన్నారు.