pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Life Style »
  • Health Benefits Of Betel Leaf

తమలపాకు గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు!

మలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

తమలపాకు గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు!
  • Edited By: Pallavi,
  • Published on September 24, 2024 / 01:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

మన సంస్కృతిలో తమలపాకుకి చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని పాన్ ఆకు అని కూడా అంటుంటారు. ఇంట్లో ఏ పండుగ అయినా, శుభకార్యం అయినా తమలపాకులు లిస్ట్‌లో ఉండాల్సిందే. ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ మెుత్తంలో కొవ్వులు ఉంటాయి. తమలపాకులు ఎన్నో రకాల వ్యాధులు, రుగ్మతల ట్రీట్మెంట్ లో సహాయపడతాయంట. తమలపాకులతో లభించే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

– మన దేశంలో చాలా మందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు. చాలామందికి దీని వల్ల ప్రయోజమేంటో తెలియదు. తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయంట

–తాంబూలానికి పొగాకును కలిపి తింటే సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి

–తమలపాకులు నమలడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది.

–జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే పనిచేస్తాయి.

–ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి

–తమలపాకులను నమలడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చు

–ప్రతి రోజూ పెద్ద గ్లాస్‌ నీటిలో కొన్ని తమలపాకులు వేసి, ఆ నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించి.. ఈ నీటిని తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దూరం.

–రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దచేసి నీళ్లతో తీసుకుంటే బోధకాలు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుందట.
–బరువు తగ్గడంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
–తమలపాకులు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ను ఆపి దంతాలను దృఢపరిచే గుణం కలిగి ఉంది
–వీటిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి సహాయపడతాయి.

–చర్మంపై అలర్జీ, దురద మొదలైన సమస్యలను తగ్గిస్తాయి తమలపాకులు
– తమలపాకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రొలిఫెరేటివ్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి.
–గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నావారు తమలపాకుల రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.

–తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి.

–వెన్నునొప్పితో బాధపడేవారు తమలపాకులకు కొద్దిగా నూనె రాసి, నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమం దొరుకుతుంది.
–బాలింతల రొమ్ముల్లో కొన్నిసార్లు పాలు గడ్డకట్టుకుపోతుంటాయి. దాని వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఆ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతిపైన ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
–గాయాలు మానడానికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. తమలపాకుల రసాన్ని గాయంపై రాసి, దానిపై మరో తమలపాకుని పెట్టి కట్టు కడతారు. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లో గాయం మానే అవకాశం ఉంటుంది.

–తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని మితంగా వాడుకోవాలి

 

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • health
  • lifestyle

Related News

  • వంకాయ తింటే ఆ వ్యాధులకు చెక్..?

  • కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ కీలక ప్రకటన

  • గుండెపోటు కు ముందు కన్పించే లక్షణాలు ఇవేనా..?

  • పురుషుల్లో బట్టతలకు కారణం అదేనా? షాకింగ్ నిజం

  • కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా?..మీ వంటగదిలోనే దీనికి మెడిసిన్!

  • సాక్స్ లేకుండా ‘షూ’ వేసుకుంటున్నారా?..ఈ వ్యాధులు గ్యారెంటీ!

Latest
  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy