కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ కీలక ప్రకటన
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం పై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇస్తూ ‘ సాధారణంగా జరిగే వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ నిన్న గురువారం యశోద ఆసుపత్రికి వచ్చారు.
వైద్యుల బృందం కేసీఆర్ ను పరీక్షించి, ఆరోగ్యంగా మంచిగా ఉందని చెప్పింది. వైద్య పరీక్షల కోసం మరో రెండు మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని” ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, కేసీఆర్ అనారోగ్య సమస్యలతో యశోద ఆసుపత్రిలో చేరారు.
నీరసం కారణంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్యపరీక్షల్లో కేసీఆర్ రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యులు గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు.



