ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం కర్నూల్ జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-.. మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. ‘ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం’ అని చంద్రబాబు తెలిపారు.



