జగన్ పై లోకేశ్ సెటైర్లు.

పల్లవి, వెబ్ డెస్క్ : అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు నిన్న సోమవారం నవ్యాంధ్ర మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. ఈ క్రమంలో పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘ ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడు వినలే..! చూడలే! ‘ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు.