ప్రపంచం చూపు ఏపీ వైపు – మంత్రి నారా లోకేశ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అత్యాధునీక సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలోన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దేశంలోనే పేరున్న దిగ్గజ జిసిసి సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ‘ ఇప్పుడు ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయం. ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా రాజధాని అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోంది అని’ అన్నారు.
ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది. మరోవైపు విశాఖ మహానగరం ఐటి హబ్ గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రస్తుతం ఎపిలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందజేస్తున్నాం. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.



