రైతులకు శుభవార్త…!
పల్లవి, వెబ్ డెస్క్ : కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. ఎనబై శాతం రాయితీతో మహిళా రైతులకు డ్రోన్లు అందిస్తోంది.
లబ్ధిదారులను ఎంపిక చేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది వందల డెబ్బై ఐదు యూనిట్లను మంజూరు చేశారు.
యూనిట్ ధర రూ. 10లక్షలు. అయితే ఇందులో ఎనిమిది లక్షలు ప్రభుత్వమే భరిస్తోంది. డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ సులభమవుతోంది.



