డీఎంకేలో ఫుల్ జోష్..విజయ్ కి చెక్ పెట్టేందుకు స్టాలిన్ బిగ్ స్కెచ్!
తన పనితోనే విమర్శలకు సమాధానమిస్తానని చెప్పారు.
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. తమిళనాడు మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం క్రీడా మంత్రిగా ఉన్న సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం స్టాలిన్. ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో అతడికి చెక్ పెట్టేందుకు స్టాలిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో తన కుమారుడికి డిప్యూటీ సీఎం హోదాను కట్టబెట్టారు. 1989లోనే ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్ కు.. డిప్యూటీ సీఎం కావడానికి 20 ఏళ్లు పట్టింది. కానీ ఆయన కొడుకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన ఐదేళ్లకే ఉప ముఖ్యమంత్రి అవగలిగారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో కేబినెట్లో ఇప్పటిదాకా 10వ స్థానంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్..సీఎం తర్వాత 2వ ర్యాంక్ కు ఎదిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి టైమ్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధిని ఎంపిక చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది.
ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రి అవడంతో డీఎంకే నేతల్లో జోష్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తారని.. తన తాత కరుణానిధిని, తండ్రి స్టాలిన్‌ను మైమరిపించే పాలనను అందిస్తారని డీఎంకే పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పగ్గాలు కూడా ఈ యువనాయకుడు త్వరలోనే చేపట్టే అవకాశాలున్నాయంటూ డీఎంకేలో చర్చ జరుగుతోంది.
ఇక, మనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి…నలుగురు ఎమ్మెల్యేలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం స్టాలిన్. ఆదివారం చెన్నైలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఇటీవల మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిలుపై విడుదలైన వి.సెంథిల్ బాలాజీతో పాటు ఆర్.రాజేంద్రన్, గోవి చెళియన్, ఎస్.ఎం నాజర్ ఉన్నారు. ఇప్పటికే మంత్రిగా ఉండటంతో ఉదయనిధి మళ్లీ ప్రమాణస్వీకారం చేయలేదు.
ఇవాళ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు చెన్నైలోని కరుణానిధి మెమోరియల్ వద్ద ఉదయనిధి స్టాలిన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి..ముఖ్యమంత్రి, మంత్రులు తనకు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా పనిచేస్తానని అన్నారు. తన పనితోనే విమర్శలకు సమాధానమిస్తానని చెప్పారు.
అయితే నటుడి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఉదయనిధి జర్నీలో కొన్ని ఆశక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. 1977 నవంబర్ 27న చెన్నైలో జన్మించిన ఉదయనిధి స్టాలిన్.. 1997లో చెన్నైలోని లయోలా కాలేజీలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును పూర్తి చేశాడు. ఆ తర్వాత 2002లో కృతికను పెళ్లి చేసుకున్నారు. 2008లో రెడ్ జెయింట్ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ బ్యానర్లో పలు సినిమాలను నిర్మించారు. 2012లో ఒరు కల్ ఒరు కన్నాడీ సినిమాతో కోలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఓకే ఓకే పేరిట తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో ఉదయనిధి నటించారు. 2019 జూలైలో డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై చేపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 14 డిసెంబర్ 2022న తమిళనాడులో క్రీడలు, యువజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. ఇక సెప్టెంబర్ 29వ తేదీన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నటించిన చివరి సినిమా మామన్నన్. ఇది 2023 లో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించింది.
Related News
-
ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన డీఎంకే నేతలు
-
వాట్ ఈజ్ దిస్ సద్గురు: ఇషా ఫౌండేషన్ పై సంచలన ఆరోపణలు..150 మంది పోలీసుల రైడ్!
-
తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసే ఛాన్స్..IRCTC ప్రత్యేక ప్యాకేజీ
-
12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలు..ఆ ప్రాంతానికి పర్యాటకుల క్యూ
-
పాలిటిక్స్ కంటే పోలీస్ ఉద్యోగమే బెటర్ : అన్నామలై
-
నిత్య పెళ్లి కూతురు.. ఆమె టార్గెట్ వారే!



