పాలిటిక్స్ కంటే పోలీస్ ఉద్యోగమే బెటర్ : అన్నామలై
రాజకీయాల కంటే పోలీస్ ఉద్యోగమే బెటర్ అనిపిస్తుందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. రోజుకో సమస్య ఎదురవుతుండడంతో పాలిటిక్స్ నుంచి తప్పుకుందామా అని ఆలోచించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. చివరకు రాజకీయాలలో కొనసాగేందుకూ పలు విషయాలలో రాజీపడక తప్పలేదన్నారు. ప్రజా జీవితంలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా.. కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలే అసత్యాలు చెప్పినా వాటిని భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కోయంబత్తూరులో తన గెలుపు కూతవేటు దూరంలో ఆగిందని.. ఏదో ఒక రోజు అది వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాల్సి ఉందని.. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.



