బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి కస్తూరి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి, బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్న ఒకప్పటి హీరోయిన్ కస్తూరి రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేమ్ద్రన్ ఆధ్వర్యంలో నటి కస్తూరి బీజేపీలో చేరారు. నటి కస్తూరితో పాటు ట్రాన్స్ జెండర్ కార్యకర్త నమితా మారిముత్తు సైతం కాషాయపు కండువా కప్పుకున్నారు. తమిళ బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ నటి కస్తూరి, నమితా మారిముత్తు లకు పార్టీ సభ్యత్వం ఇచ్చి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నటి కస్తూరి మోడల్ గా రాణించడంతో పాటు తెలుగు తమిళ మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే గత ఏడాది నవంబర్ నెలలో మూడో తారీఖున చెన్నైలో హిందూ మక్కల్ కచ్చి నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన నటి కస్తూరు మాట్లాడుతూ ” తమిళనాడులో నివసించే తెలుగు మాట్లాడే ప్రజలు తమను తాము తమిళులుగా చెప్పుకుంటున్నారని, కానీ ఏండ్ల క్రితం వలస వచ్చిన బ్రాహ్మణులను మాత్రం తమిళులుగా అంగీకరించడం లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీసింది. అప్పట్లో కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ నాయకులు సీఎంకే రెడ్డి, కార్యదర్శి ఆర్ నందగోపాల్ ఇచ్చిన పిర్యాదు మేరకు గ్రేటర్ చెన్నై పోలీసులు నటి కస్తూరి పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరడం సంచలనానికి దారి తీసింది.