pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Breaking News »
  • Brs Graph Falling In Jubilee Hills

జూబ్లీహిల్స్ లో పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్..!

జూబ్లీహిల్స్ లో పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్..!
  • Edited By: Pallavi,
  • Published on August 19, 2025 / 10:45 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య సమస్యలతో అకాలమరణం నొందిన సంగతి తెల్సిందే. ఎమ్మెల్యే మాగంటి మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే త్వరలో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై దృష్టి సారించింది. మంత్రులు రోజుకోకరూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను మమ్మురం చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధానప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకతను ఉపఎన్నికల్లో గెలిచి చాటాలని వ్యూహారచనలు చేస్తుంది. అందులో భాగంగానే జూలై నెలలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఓటరు నాడి, ప్రజల నాడి ఎలా ఉందనే విషయంపై పలు సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేలో బీఆర్ఎస్ కి 40% మంది, అధికార పార్టీ కాంగ్రెస్ కి -35%, బీజేపీ 25% మంది సానుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సర్వే పార్టీల పేరుతో బీఆర్ఎస్ నిర్వహించింది. ఇలా పార్టీ పేరుతో బీఆర్ఎస్ అధినాయకత్వంతో పాటు, ఇటీవల ఇంచార్జ్ గా పనిచేసిన ఓ ముఖ్యనేత, తాజా ఎమ్మెల్సీ నిర్వహించిన సర్వేలో సైతం ఇంచుమించు ఇదేవిధంగా సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

జూలై నెలలో నిర్వహించిన సర్వేలో తమకు అనుకూలంగా రావడంతో ఆగస్టు రెండో వారంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసురాలిగా ఆయన సతీమణీ సునీతను ప్రధాన అభ్యర్థిగా సర్వే నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే సర్వే ఫలితాలు వచ్చినట్లు తేలింది. అంతకుముందు పార్టీ పేరుతో నిర్వహించిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీకి , బీఆర్ఎస్ కు మధ్య ఓట్ల శాతం ఐదు శాతం ఉండగా తాజాగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయినట్లు తేలింది. అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం తేడా కేవలం మూడు శాతం ఉన్నట్లు పార్తీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు తెలుస్తుంది. పార్టీ అభ్యర్థిగా సునీత మైనస్ కావడం , ఆమెపై ఇంటబయట తీవ్ర వ్యతిరేకత ఉండటం, స్థానిక అభ్యర్థి కాకపోవడం, రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోవడం, ఇంట్లో గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, గతంలో మాగంటి గోపినాథ్ ను చూసి ఎంత తీవ్ర అసంతృప్తి ఉన్న క్యాడర్ సైతం ఆయన లేకపోవడంతో తమ నిరసన గళం వినిపించడం ఇలా పలు కారణాలతో తాజా సర్వేలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకతతో ఓటర్లతో పాటు ప్రజలున్నట్లు తేలింది.

కేవలం అభ్యర్థి సునీత అని అనాధికారకంగా నిర్వహించిన సర్వేలో ఇంత వ్యతిరేకత రావడం పార్టీ అధినాయకత్వంలో కంగారు రేపింది అని బీఆర్ఎస్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు రెండు నెలలు సమయం ఉండటం. ఈ సమయంలో ఇంకా వ్యతిరేకత రావడం ఖాయం .. అందుకే మాగంటి కుటుంబ సభ్యులు కాకుండా వేరే బలమైన స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడికి అవకాశం ఇవ్వాలని కూడా ఆ సర్వేలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. ఇటీవల తెలంగాణ భవన్ లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో సైతం మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా సునీతమ్మకు తప్పా ఎవరికిచ్చిన తాము పనిచేస్తామని, పార్టీ గెలుపు ఖాయమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. రెండోసారి నిర్వహించిన సర్వేలో సైతం ఓటింగ్ శాతం తగ్గడం కూడా బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసిందంట. ఇంకా ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే స్థానికంగా బలమైన క్యాడర్ , ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడ్ని అభ్యర్థిగా ప్రకటించాలని. లేకపోతే ఇంకా గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు నాయకత్వానికి సూచిస్తున్నారంట. చూడాలి మరి బీఆర్ఎస్ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో..!

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #news
  • big news
  • bjp
  • breaking news
  • BRS

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy