వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?

పల్లవి, వెబ్ డెస్క్ : అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వాహనమిత్ర పథకానికి నగదు జమచేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులోభాగంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పదిహేను వేల రూపాయలను బ్యాంకులో జమచేయనున్నది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు.
తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఫ్యామిలీలో ఒక్క వాహనానికి ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నా వారు, సిటీల్లో వెయ్యి చదరపు గజాలకు మించి స్థిరాస్తి ఉండకూడదు. అయితే ఏపీ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫిటినెస్ ధృవీకరణ పత్రాలుండాలి.
మరోవైపు కరెంటు బిల్లు నెలకు కేవలం మూడు వందలు మాత్రమే రావాలి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ పదిహేను వేలు ఇవ్వడానికి ఈనెల పదమూడో తారీఖు నాటికి ఉన్న పాత జాబితాను ప్రభుత్వం పరిశీలించనున్నది. అయితే కొత్తవారు ఈనెల పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్ లైన్ లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.