తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసే ఛాన్స్..IRCTC ప్రత్యేక ప్యాకేజీ
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఓ టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)పర్యాటకుల కోసం తక్కువ ధరకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇందులో విహారయాత్రల నుండి మతపరమైన ప్రదేశాల వరకు అన్నీ ఉంటాయి. తాజాగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఓ టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ‘దక్షిణ్ దర్శన్ యాత్ర(Dakshin darshan yatra)’ పేరుతో ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లు ఉంటుంది.
తిరుపతి బాలాజీ, పద్మావతి ఆలయం, రామనాథస్వామి జ్యోతిర్లింగ ఆలయం, ముథుర మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, కేరళలోని పద్మనాభస్వామి ఆలయాలను సహా మరికొన్ని ప్రముఖ ఆలయాలను,ప్రదేశాలను ఈ ప్యాకేజీలో భాగంగా సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ గుజరాత్ లోని రాజ్ కోట్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలోనే కలిపి రైలు టిక్కెట్లు, బస్ సర్వీస్, హోటల్ బస, ఆహారం, దేవాలయాలను సందర్శించడానికి టిక్కెట్లు మొదలైనవి ఉంటాయి.
ఛార్జీ ఎంత ఉంటుంది?
ఈ ప్యాకేజీ రూ 19,930 నుండి ప్రారంభమవుతుంది. మీ బడ్జెట్ ప్రకారం రైలులోని స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలను ఎంచుకోవచ్చు. మీరు స్లీపర్ లో ప్రయాణిస్తే ఒకరికి రూ.19,930 చెల్లించాలి. థర్డ్ ఏసీ అయితే ఒక్కొక్కరికి రూ.35,930 చెల్లించాలి. సెకండ్ ఏసీ కోసం మీరు ఒక్కో వ్యక్తికి రూ.43,865 వెచ్చించాల్సి ఉంటుంది.
ఎలా బుక్ చేసుకోవాలి
IRCTC వెబ్సైట్ irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన సమాచారం కోసం మీరు 9321901849 / 9321901852 / 7021090644 / 7021090626 / 7021090572 / 7021090498 / 8287931 నంబర్లకు కాల్ చేయవచ్చు.
Related News
-
కేరళలో మంకీపాక్స్ కలకలం.. రెండు కేసులు నమోదు
-
సిద్దిపేటలో టీటీడీ వేంకన్న ఆలయం ఏర్పాటు
-
Priyanka Gandhi : భారీ విజయం.. రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక
-
అప్పు చేసి మరో మహిళతో భర్త పరార్.. ఆదుకున్న లులూ చైర్మెన్
-
వాట్ ఈజ్ దిస్ సద్గురు: ఇషా ఫౌండేషన్ పై సంచలన ఆరోపణలు..150 మంది పోలీసుల రైడ్!
-
డీఎంకేలో ఫుల్ జోష్..విజయ్ కి చెక్ పెట్టేందుకు స్టాలిన్ బిగ్ స్కెచ్!



