కేరళలో మంకీపాక్స్ కలకలం.. రెండు కేసులు నమోదు
కేరళలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అక్కడ రెండు కేసులు నమోదు అయ్యాయి. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లుగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు
కేరళలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అక్కడ రెండు కేసులు నమోదు అయ్యాయి. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లుగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇద్దరిలో ఒకరు వాయనాడ్ జిల్లాకు చెందిన వారు కాగా మరోకరు కన్నూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లుగా తెలిపారు. విదేశీ దేశాల నుండి వచ్చేవారికి ఎంపోక్స్ లక్షణాలు ఉంటే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు.



