నితీశ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్టులో మోకాలి గాయంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ సీజన్ లో ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ను వదిలిపోనున్నారు అని వార్తలు తెగ గుప్పుమన్నాయి.
ఈ వార్తలపై నితీశ్ కుమార్ రెడ్డి క్లారిటీచ్చారు. తాను ఐపీఎల్ ప్రాంచైజీ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. వచ్చేడాది లో జరగనున్న వేలానికి టీమ్ లో తనపాత్రపై నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో సన్ రైజర్స్ జట్టును వీడాలని అనుకుంటున్నాడని ఆ వార్తల సారాంశం.
దీనిపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీచ్చారు. సోషల్ మీడియాలో సాధారణంగా నేను ఇలాంటి ప్రచారాలకు చాలా దూరంగా ఉంటాను. కానీ కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడం అవసరం. సన్ రైజర్స్ హైదరాబాద్ నా బంధం.. నా నమ్మకం.. నా గౌరవం.. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న అభిరుచిపై ఆధారపడి ఉంది . కాబట్టి నేను ఎల్లప్పుడూ ఈ జట్టుతోనే ఉంటాను’ అని ఎక్స్ లో రాసుకొచ్చాడు.