బుమ్రాపై బీసీసీఐ అసంతృప్తి…!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడకపోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఐదు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే 1-2తో వెనకంజలో ఉన్న భారత్ తప్పక గెలవాల్సిన ఐదో మ్యాచ్ కు బుమ్రా గైర్హాజరు కావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కు ముందు మూడు మ్యాచులకు మాత్రమే తాను అందుబాటులో ఉంటానని బుమ్రా యజమాన్యానికి తెలిపారు. అయితే ఏ మ్యాచులకు తాను అందుబాటులో ఉంటానో క్లారిటీ ఇవ్వలేదని బీసీసీఐ పేర్కొంది. దీంతో ప్రతీ మ్యాచుకు ముందు బౌలర్ల ఎంపికపై గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇకపై ఆడే ప్రతి ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఉన్నప్పుడల్లా అన్ని మ్యాచులకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేస్తేనే బుమ్రా ఎంపిక ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసిందని క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో భాగంగా ఐదో మ్యాచ్ లో టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలిరోజు పలుమార్లు వర్షం అడ్డుతగిలిన కానీ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్ కరుణ్ నాయర్ 98బంతుల్లో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. కరుణ్ కు జోడిగా వాషింగ్టన్ సుందర్ 19పరుగులతో ఉన్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ 38, శుభ్ మన్ గిల్ 21 పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో అట్కెషన్ రెండు, టంగ్ రెండు వికెట్లతో రాణించారు.