టీమిండియా కు బిగ్ షాక్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కష్టాలు తప్పేటట్లు లేవు. ఇప్పటికే సిరీస్ లో వెనకబడిన భారత్ జట్టుకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా తాజాగా మరో ఆటగాడు గాయపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు భారత్ కీలక ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇంగ్లీష్ జట్టు బౌలర్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయాడు.
ఈ క్రమంలో ఆ బంతి నేరుగా పంత్ కుడిపాదంపై పడింది. దీంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కి ఆప్పిల్ చేయగా ఎంపైర్ ఆ బంతి బ్యాట్ కు తాకుతూ వెళ్లడంతో నాటౌట్ గా ప్రకటించాడు. అయితే ఆ బంతి పంత్ కు బలంగా తాకడంతో పంత్ తీవ్రనొప్పితో విలవిలాడిపోయాడు.
టీమిండియా సహచరుల అండతో పంత్ మైదానం నుంచి వీడాడు. పంత్ కు తగిలిన గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత పరిస్థితిపై ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా మొదటి రోజు 83ఓవర్లో నాలుగు వికెట్లను కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ జైస్వాల్ 58, సాయి సుదర్శన్ 61, కేఎల్ రాహుల్ 46, పరుగులతో రాణించారు.క్రీజులో రవీంద్ర జడేజా 19, శార్దుల్ ఠాకూర్ 19 పరుగులతో ఉన్నారు.