కశ్మీర్ పై పాక్ ప్రధాని మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ దేశపు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఇండియా పాక్ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం కశ్మీర్ అంశమని వివాదసొఅద వ్యాఖ్యలు చేశారు.
సరిగ్గా ఆరేండ్ల కిందట 2019లో శాంతిస్థాపన కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370 రద్ధు చర్య పై కూడా ఆయన అక్కసును వెళ్లగక్కారు. ఈ విషయంలో న్యూఢిల్లీ ఏకపక్షంగా చర్యలు తీసుకుందంటూ భారత్ సర్కారుపై ఆయన నిందారోపణలు చేశారు.
పాక్ ఇండియా సమస్యకు న్యాయపరమైన పరిష్కరానికి తమదేశపు విదేశాంగ శాఖ విధానం కట్టుబడి ఉందని మళ్లీ ఆయన పాత పాటే పాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొరుగు దేశాలతో తాము స్నేహపూర్వక బంధాలను కొరుకుంటున్నాము. ఎవరైనా దురక్రమణలకు పాల్పడితే చట్టపర చర్యలకు దిగడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.