టీమిండియా చెత్త రికార్డు..!

పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. పదేండ్ల తర్వాత అత్యంత చెత్త రికార్డును ఈ టెస్టు మ్యాచ్ లో నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో నాలుగో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు ఏడు వికెట్లను కోల్పోయి 544 పరుగులు చేసింది.
భారత్ బౌలర్లందరూ గత పదేండ్లల్లో ఎన్నడూ లేనివిధంగా దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా , సిరాజ్ మహ్మద్, ఈ మ్యాచ్ లో తొలిసారిగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్, పేస్ ఆల్‌రౌండర్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ దారుణంగా పరుగులిచ్చారు. వికెట్ల సంగతి దేవుడెరుగు కనీసం పరుగులు ఇవ్వకుండా నియంత్రించడంలో విఫలమయ్యారు. భారత్ బౌలర్ల పరిస్థితి ఇలా ఉంది.
చివరగా 2015 లో సిడ్నీ వేదికగా ఆసీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓవర్ సీస్ కండీషన్స్ లో భారత్ 500+ పరుగులు ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 572 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఇప్పటివరకూ భారత్ ఎప్పుడు ఐదువందలకు పైగా పరుగులను ఇవ్వలేదు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లోనే 544 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ పై 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది.