ఐదో టెస్టు కి టీమిండియాలో మార్పులు..!

పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో డ్రా చేసుకుని మంచి జోష్ లో ఉన్న టీమిండియా ఐదో టెస్టు మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని నెట్ లో భారత్ తెగ శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో మార్పులు చేపట్టాలని జట్టు యజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్ సిరీస్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్షదీప్ సింగ్ ను రంగంలోకి దించాలని టీమిండియా ఆలోచిస్తుంది.
అర్ష్ దీప్ సింగ్ ను నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆడించాలని చూసినా కానీ అతడి చేతి బోటన వేలుకి తగిలిన గాయంతో ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాజాగా నిన్న మంగళవారం లండన్ లో ఓవల్ మైదానంలో అర్ష్ దీప్ సింగ్ చురుకుగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో అర్ష్ దీప్ గాయం నుంచి కోలుకోని మ్యాచ్ కు సిద్ధమైనట్లు భావిస్తున్నారు.
లెప్ట్ హ్యాండ్ పేస్ బౌలరైన అర్ష్ దీప్ ఇప్పటివరకు 21 టెస్టులు ఆడాడు. 66వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ లో ఏకైక ఎడమచేతి వాటం బౌలర్ కావడంతో భారత్ కు బలం అవుతుందని జట్టు యజమాన్యం భావిస్తుంది. ఇక నాలుగో టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన కొత్త బౌలర్ అన్షుల్ కాంబోజ్ కు ఐదో మ్యాచ్ లో చోటు దక్కే అవకాశాలు లేనట్లే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోతే అర్ష్ దీప్ సింగ్ , అకాశ్ సింగ్ లను తుదిజట్టులోకి తీసుకోవడం ఖాయమనే తెలుస్తుంది.మాంచెస్టర్ టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన కొత్త పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఖాయమనే తెలుస్తుంది.