అప్పు చేసి మరో మహిళతో భర్త పరార్.. ఆదుకున్న లులూ చైర్మెన్
భార్య పేరు మీద నాలుగు లక్షల రూపాయల లోన్ తీసుకొని కట్టకుండా వేరే మహిళ కోసం భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు ఓ భర్త.. తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న అతని భార్యకు సాయం చేయడానికి ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించారు కేరళ ప్రజలు,
భార్య పేరు మీద నాలుగు లక్షల రూపాయల లోన్ తీసుకొని కట్టకుండా వేరే మహిళ కోసం భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు ఓ భర్త.. తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న అతని భార్యకు సాయం చేయడానికి ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించారు కేరళ ప్రజలు, లులూ గ్రూప్స్ చైర్మెన్ యూసఫ్ అలీ. అయితే ఇదంతా కేవలం నాలుగు గంటల్లోనే జరగడం విశేషం.
కేరళకు చెందిన ఓ వ్యక్తి NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ) నుండి నాలుగు లక్షలు అప్పుగా తీసుకొని అవి చెల్లించకుండా వేరే మహిళ కోసం తన భార్య సంధ్య , ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. అయితే సంధ్యకు తక్కువ జీతం ఉన్న ఉద్యోగం కావడంతో.. ఆ అప్పును తిరిగి చెల్లించలేకపోయింది. ఈ క్రమంలో అప్పు కాస్త రూ. 8 లక్షల వరకు పెరిగిపోయింది. దీంతో ఆమె ఇంట్లో లేని సమయమంలో NBFC వాళ్ళు తాళం పగలకొట్టి ఇంట్లో చొరబడి వాళ్ల తాళం వేసుకున్నారు.
దీనికి సంబంధించి స్థానిక మీడియాలో వార్తలు రావడంతో.. ఈ విషయం తెలుసుకున్న కేరళ ప్రజలు సంధ్య కుటుంబానికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ వార్త తెలుసుకున్న లులూ గ్రూప్స్ ఛైర్మెన్ యూసఫ్ ఆలీ ఆ మహిళకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.. సదురు మహిళ అప్పును తీర్చడమే కాకుండా ఆమె పిల్లల భవిష్యత్ కోసం రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. యూసఫ్ అలీ లేకుంటే తాను, తన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడేవారిమని సంధ్య తెలిపారు.
Related News
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు



