భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్లో ఆసక్తికరమైన అంతర్జాతీయ విద్యార్థి విజ్ఞాన కార్యక్రమం నిర్వహించబడింది. భారతదేశంలోని యువ మేధావులను బంగ్లాదేశ్ సహచరులతో కలిపే ఈ కార్యక్రమం, వనరులపై బాధ్యతాయుతమైన భావాన్నీ పెంపొందించాలనే ఉద్దేశ్యం తో 6, 7, 8వ తరగతి విద్యార్థులను పర్యావరణ బాధ్యత మరియు గ్లోబల్ పౌరసత్వం పై చర్చను నిర్వహించింది.

రెండు దేశాల విద్యార్థులు వ్యర్థాల తగ్గింపు వ్యూహాలు, ఇంధన సంరక్షణ పద్ధతులు మరియు జీవవైవిధ్య పరిరక్షణ ప్రయత్నాల వంటి ఆచరణలను పరిశీలించారు. ఈ కార్యక్రమం వివిధ నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులను ఒకచోట చేర్చి వారి విభిన్న అభిప్రాయాలు మరియు అనుభవాలను పంచుకునే అవకాశాన్ని కల్పించింది. యువతను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దడం ద్వారా యువత సరిహద్దులను దాటి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి, పర్యావరణ బాధ్యతను పంచుకోవడానికి, ఆచరణలను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి, మార్గదర్శకంగా ఉంటాయి.