అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విద్యారావు గారు జెండాను ఎగరవేశారు.

అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విద్యారావు గారు జెండాను ఎగరవేశారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ ముక్త కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యాధరి గారు గణతంత్ర దినోత్సవం గురించి ఉపన్యసిస్తూ “న్యూఢిల్లి లో జరిగే పరేడ్ లో తొమ్మిదో తరగతి విద్యార్థిని గోద్విజ పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఇకఎన్ సి సి క్యాడట్స్ అద్భుతంగా క్రమశిక్షణ, సమన్వయంతో పరెడ్ నిర్వహించారు. ప్రైమరీ విద్యార్ధులు దేశ సంస్కృతిని తెలియజేస్తూ నృత్య ప్రదర్శనతో అలరిస్తూ దేశభక్తి గీతాలతో దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విద్యార్థులు తమ హృదయంలో దేశభక్తినీ నింపుకొని సారే జహసే అచ్చా అంటూ ఆనందాన్ని వ్యక్తపరచారు. ఇక ఈ కార్యక్రమంలో HR అధినేత గజాల గారు కూడా పాల్గొన్నారు.