వాట్ ఈజ్ దిస్ సద్గురు: ఇషా ఫౌండేషన్ పై సంచలన ఆరోపణలు..150 మంది పోలీసుల రైడ్!
ఇషా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సద్గురు జగ్గీ వాసుదేవ్..గత కొంతకాలంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువగా వినబడుతున్న పేరు. దీనికి కారణంగా వివిధ అంశాలపై ఆయన మాట్లాడే మాట్లాడే మాటలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమే. పలు ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వాస్తవరూపంలో కళ్లకు కట్టినట్టుగా ఆయన సమాధానాలు ఉంటుండటంతో సోషల్ మీడియాలో ఆయన వీడియోలను తెగ చూసేస్తుంటారు. ఒక్క మనదేశంలోనే కాదు నేపాల్, శ్రీలంక, భూటాన్, అమెరికా, కెనడా వంటి చాలా దేశాల్లో కూడా సద్గురు బోధనలు చాలా ఫేమస్. అయితే సద్గురు బోధనలతో ప్రేరణ పొందిన చాలామంది యువతులు పెళ్లి చేసుకోకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేందుకు సిద్దమైపోతున్నారు కూడా. అయితే ఇటీవల ఇద్దరు యువతలు కూడా సద్గురు భోధనలతో ప్రేరణ పొంది పెళ్లి చేసుకోకుండా సన్యాసం స్వీకరించి సద్గురు స్థాపించిన కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లోనే గడుపుతున్నారు.
అయితే తన ఇద్దరు కుమార్తెలు ఇషా యోగా కేంద్రంలో జీవితాంతం సన్యాసినులుగా ఉండేలా సద్గురు బ్రెయిన్ వాష్ చేశారని ఆరోపిస్తూ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు జగ్గీ వాసుదేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన సొంత కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసి, ఇతరుల కుమార్తెలను సన్యాసినులుగా మారేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సద్గురును ప్రశ్నించింది. ఇషా ఫౌండేషన్ తరఫున హాజరైన న్యాయవాది.. వయోజనులు తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని మేము నమ్ముతున్నాం… మేము పెళ్లి చేసుకోవద్దని లేదా సన్యాసం తీసుకోమని బలవంతం చేయడం లేదని.. ఇవి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు. బ్రహ్మచార్య లేదా సన్యాసాన్ని స్వీకరించిన కొద్దిమందితో పాటు సన్యాసులు కాని వేలమందికి ఇషా యోగా సెంటర్ వసతి కల్పిస్తుందని చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టు హాజరైన ఆ ఇద్దరు మహిళలు.. తాము ఇష్టపూర్వకంగానే అక్కడ ఉన్నామని, ఎవరూ తమను బలవంతం చేయడం లేదని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఇషా ఫౌండేషన్‌పై పెండింగ్‌లో ఉన్న అనేక క్రిమినల్, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయన్న న్యాయస్థానం.. ఇషా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతర విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
అయితే మంగళవారం ఇషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేపట్టారు కోయంబత్తూరు పోలీసులు. ఇషా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని కేసుల వివరాలను సేకరించి తమ ముందు హాజరుపరచాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. మొత్తం 150మంది పోలీసుల టీంతో ఈ దాడులు చేసినట్లు సమాచారం.
Related News
-
తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసే ఛాన్స్..IRCTC ప్రత్యేక ప్యాకేజీ
-
డీఎంకేలో ఫుల్ జోష్..విజయ్ కి చెక్ పెట్టేందుకు స్టాలిన్ బిగ్ స్కెచ్!
-
12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలు..ఆ ప్రాంతానికి పర్యాటకుల క్యూ
-
సద్గురు సేవ్ సాయిల్ ఆదర్శంతో రైతుల ముందడుగు.. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు
-
విద్య కోసం పరుగు: NMDC మారథాన్‌లో ఈశా బ్రహ్మచారులు
-
నిత్య పెళ్లి కూతురు.. ఆమె టార్గెట్ వారే!



