నిత్య పెళ్లి కూతురు.. ఆమె టార్గెట్ వారే!
పల్లవి, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఆమె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా యాభై పెళ్లిలు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకుంటేనే వెంటనే దొరికిపోతుంటారు. అలాంటిది యాభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే ఆ నిత్య పెళ్లి కూతురు సాధ్యమేనంటుంది. ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకొని చివరకు పోలీసుల చేతికి చిక్కింది.
వివరాల్లోకి వెళ్లితే.. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా.. అందులో భర్త పేరు వేరే ఉంది. దీంతో అతను సంధ్యను నిలదీయగా చంపేస్తానని బెదిరించింది. దీంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో కూడా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సంధ్యను అదుపులో తీసుకొని విచారిస్తే ఆమె.. అప్పటికే ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తేలింది. ఆ కేసును విచారించిన పోలీసులు కూడా అవాక్కయ్యారు. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది. పెళ్లి కాని యువకులను ఆమె టార్గెట్ చేస్తుందట. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ యువతి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



