అత్యాచారం కేసులో పాక్ క్రికెటర్ అరెస్ట్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు చెందిన ఏ టీమ్ షాహీన్ స్క్వాడ్‌లో ఒకడైన క్రికెటర్ హైదర్ అలీ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదర్ అలీని మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కేసులో ఇరుక్కున్న హైదర్‌పై పాకిస్తాన్ బోర్డు వేటు వేసింది. అతడి స్థానంలో మహమ్మద్ ఫయీక్ను పాకిస్థాన్ జట్టు సెలెక్టర్లు. ఎంపిక చేశారు .
ఈ సందర్భంగా మాంచెస్టర్ పోలీసులు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో ” ఈనెల ఆగస్టు 4న హైదర్ ఆలీపై అత్యాచారం కేసు రిజిస్టర్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల హైదర్ అలీని అరెస్ట్ చేశాం. మాంచెస్టర్ పరిసరాల్లో జూలై 23న అత్యాచార ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తునే వేగవంతం చేశాం. బాధితురాలికి అధికారులు అన్నివిధాలా సాయంగా నిలుస్తున్నారు’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.