ఫోన్ ట్యాపింగ్ కేసు పై ఈటల సంచలన వ్యాఖ్యలు
Eatala Rajendar Member of the Lok Sabha

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ ఇష్యూ. ఇది రాజ్యాంగానికి, హక్కులకు, స్వేచ్ఛకు విరుద్ధమైన చర్య. చేతిలో అధికారం ఉందని ఏది పడితే అది చేయడానికి వీల్లేదు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులు ఎవరో తేలాలి. వారికి శిక్ష పడాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఈ కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది.
అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు సిట్ విచారణకు హజరయ్యారు. ఈ సందర్భంగా తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు.