రుణమాఫీ సంగతి ఏంది? : మాజీ మంత్రి కేటీఆర్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
అరకొర ఇస్తున్న ‘రైతుభరోసా సరే.. ఎగ్గొట్టిన రైతుభరోసా, వడ్ల బోనస్ సంగతి ఏంది? తులం బంగారం, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రూ.2500 మహాలక్ష్మి, ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి? రైతు బీమా, ఆగిపోయిన రుణమాఫీ సంగతి ఏంది?’ అని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .