Priyanka Gandhi : భారీ విజయం.. రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక
Priyanka Gandhi : కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తొలి ప్రయత్నంలోనే విజయఢంకా మోగించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని దక్కించుకున్నారు.
Priyanka Gandhi : కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తొలి ప్రయత్నంలోనే విజయఢంకా మోగించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో ఆమె తన సమీప అభ్యర్థిపై ఏకంగా 3.94లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు.
వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు.



