pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Telangana »
  • Revanth Prisoner Kcr Visionary

రేవంత్ ప్రిజనరీ, కేసీఆర్ విజనరీ -మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

రేవంత్ ప్రిజనరీ, కేసీఆర్ విజనరీ -మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • Edited By: Pallavi,
  • Published on August 9, 2025 / 09:45 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు డెమోక్రసీ కాదని హిపోక్రసి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.ఏమాత్రం ప్రజాస్వామ్య స్పూర్తి లేకుండా కపటత్వ ఎత్తుగడలతో పొంతనలేని కామెంట్లు చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పరువుతీస్తు న్నారని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ కు పెద్దశిక్ష అని, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచిత మని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం లో జయాపజయాలు సహజమని ఆయన పేర్కొంటూ ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా పెద్ద శిక్ష అవుతుందో రేవంత్ కే తెలియాలని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవుతోంది.గతంలో ఇందిరా గాంధీతో పాటు అమేథీ , రాయబరేలీ స్థానాలలో రాహుల్, కొడంగల్ లో రేవంత్ కూడా ఓడిపోయారని జీవన్ రెడ్డి గుర్తు చేస్తూ వారి ఓటమిలు కూడా కాంగ్రెస్ కు పడిన పెద్దశిక్షలేనా? అని నిలదీశారు.ఎప్పటికీ గెలవలేని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, త్రిపుర, ఆంధ్ర ప్రదేశ్, డిల్లీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు మరణశిక్ష పడినట్లు భావించాలా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రిజనరీ అని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజనరీ నేత అని ఆయన అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చంచల్ గూడ జైలు జీవితం గడిపిన అనుభవం రేవంత్ రెడ్డికి ఉందని అందుకే ఆయన పసుపు కండ్లకు ఎర్రవెల్లి ఫార్మర్ హౌస్ కూడా చర్లపల్లి జైలులా కనిపిస్తోందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రేవంత్ సోదరులు, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు కూడా జైళ్లేనా?, వారు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారా?అని ఆయన ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు అండ చూసుకొని సీఎం రేవంత్ ఒక పథకం ప్రకారం కేసీఆర్ ను దెబ్బతీసే కుట్రలో భాగంగా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతు న్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన ఘోష్ కమీషన్ తో చివరకు కాంగ్రెస్సే స్మాష్ అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైఫిల్ రెడ్డిగా ప్రాచుర్యం పొందిన
కాంగ్రెస్ చేతిలోని కట్టె తుపాకీ చూసి ’గువ్వలు’ భయంతో ఎగిరిపోతాయామో కానీ గులాబీగుండెలు చెదరవని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కేసీఆర్ పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.ఉద్యమ నేత జోలికొస్తే కాంగ్రెస్ కు ఉప్పు పాతరేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #pallavi
  • anumula revanth reddy
  • armoor former brs mla
  • ashannagari jeevan reddy
  • big news

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy