ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం గురించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణపై రాహుల్ గాంధీ మరోసారి తన నిరసన గళం వినిపించారు. దేశంలో గత కొన్నాళ్లుగా వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని రాహుల్ గాంధీ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు.
దేశంలో ఇటీవల జరిగిన హర్యానా, మధ్యప్రదేశ్ లోనూ ఇదే విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని రాహుల్ తెలిపారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా తనకు అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫోలింగ్ తర్వాత నిర్వహించే ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు.
దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోదన చేసినట్లు ఆయన వివరించారు. ఆ పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని రాహుల్ చెప్పుకోచ్చారు. ఎన్నికల నిర్వహణ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ తో నిర్వహించాలని మరోసారి ఈసీని కోరారు.