నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.
పల్లవి, వెబ్ డెస్క్ : దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీలను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో ఈడీ కోరింది.
యంగ్ ఇండియా కంపెనీ పేరిట రూ.2వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందని, ఆ డబ్బు కాజేసేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించారని వారిపై ఈడీ అభియోగాలు మోపింది. దీంతో సోనియా, రాహుల్ విచారణకు కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.



