కౌశిక్ రెడ్డి vs అరెకపూడి గాంధీ..పచ్చి బూతులు,అంతా టెన్షన్
సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇద్దరి ఇళ్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ లో మాట్లాడిన కౌశిక్ రెడ్డి..బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపుతున్నానంటూ సంచనల కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి.. తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టు తీర్పుతో గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మాటలు మారుస్తున్నాడని, ఆయన నకిలీ గాంధీగా మారిపోయాడన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని..తాను గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్లి ఆయన మెడలో కండువా కప్పుతానని.. గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
కౌశిక్ రెడ్డి సవాల్‌పై తాజాగా ఎమ్మెల్యే గాంధీ స్పదించారు. దమ్ముంటే కౌశిక్ రెడ్డి ఈరోజు 11 గంటలకల్లా తన ఇంటిపై జెండా ఎగరవేయాలని..లేకుంటే 12 గంటలకల్లా తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. తన యుద్ధం బీఆర్ఎస్తో కాదని కౌశిక్ రెడ్డితోనేని అన్నారు. దమ్ముంటే రారా అంటూ బూతులతో రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డో,తానో తాడోపేడో తేల్చుకుంటానన్నారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు.
సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇద్దరి ఇళ్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు. ఇక,అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Related News
-
రోహిత్ శర్మను ఔట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
-
MLC Elections: BRS, కాంగ్రెస్ కు భారీ షాక్
-
ఒళ్లు దగ్గర పెట్టుకో కౌశిక్ రెడ్డి.. చెప్పు తెగుద్ది : కాంగ్రెస్ మహిళా నేత ఫైర్
-
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
-
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు
-
సీఎం రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష.. వెంటనే క్షమాపణలు చెప్పాలి : నిరంజన్ రెడ్డి



