ఒళ్లు దగ్గర పెట్టుకో కౌశిక్ రెడ్డి.. చెప్పు తెగుద్ది : కాంగ్రెస్ మహిళా నేత ఫైర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని, గాజులు తొడుక్కోవాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని, గాజులు తొడుక్కోవాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఒకటి చూపించాలనుకుంటున్నాం అంటూ చెప్పు తీసి చూపించారు. ఇంకోసారి అలా కించపరిచేలా మాట్లాడితే ఈ చెప్పుతోనే దెబ్బలు తినాల్సి వస్తుంది. మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరించారు.
తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందన్న ఆమె.. మహిళలను అడ్డుపెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చీర, గాజులు పంపాలంటే ముందుగా కేసీఆర్ కు పంపించాలని ఇతర పార్టీ నాయకులతోనే టీఆర్ఎస్ పుట్టిందన్నారు. మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ విచారణకు పిలవాలని కోరారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరుతామన్నారు శోభరాణి.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర



