బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ లేదా బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరను అని కూడా క్లారిటీచ్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాం చంద్రరావు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత బీజేపీలో చేరికపై క్లారిటీచ్చారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి అవినీతి పరులకు, కుంభకోణాలు చేసినవారికి స్థానం లేదని తేల్చి చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికి ఒకటేనని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు అన్నదమ్ములు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం బ్యారేజ్ లపైనే కాదు మొత్తం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. యూరియా కొరతపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన తప్పుల వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించింది. యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి సిద్ధంగానే ఉంటుంది. మోదీ సర్కారు రైతు పక్షపాతి ప్రభుత్వం. కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.