భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.
రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు, చెరువుల దగ్గరికి వెళ్ళొద్దని కోరారు. రైతులు పొలంలో ఉన్న బావుల దగ్గర వెళ్లేటప్పుడు వైర్లను గాని, స్టార్టర్ పెట్టెలను ఎవరు ముట్టుకోవద్దు అని సూచించారు.
అలాగే పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోవడం, మురుగునీరు ఉప్పోంగడం, వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు.