పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం మరిన్ని వాదనలు వినిపిస్తామని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు అందుకు ఒప్పుకున్నది. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అందుకు అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు గడువు నిర్దేశించలేవని ఏజీ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



