కేటీఆర్ కు పొంగులేటి సవాల్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ” వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి కాదు ఎక్కడ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, పొంగులేటి చాప్టర్ క్లోజ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ దమ్ముంటే కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలి. మీ అయ్య కేసీఆర్ మూడు సార్లు పాలేరులో తిరిగిన నన్ను ఓడించలేకపోయారు.
బచ్చా గాడివి నీవల్ల ఏమవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. రెండు సార్లు బుద్ధి చెప్పిన మారలేదు. మూడోసారి బుద్ధి చెప్తారు. అధికారం పోయిన అహాంకారపూరిత మాటలు తగ్గలేదు అని ఆయన అన్నారు.