సీఎం రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష.. వెంటనే క్షమాపణలు చెప్పాలి : నిరంజన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం వనపర్తిలో ఆయన మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడాలని సూచించారు. – క్షుద్రరాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి మునిగిపోవడం ఖాయమని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గతంలో చట్టబద్ధంగా బీఆర్ఎస్ విపక్ష ఎమ్మెల్యేలను విలీనం చేసుకుందని చెప్పారు.



